Friday, 6 November 2026

రాజకీయంగా ఎదుర్కొలేకే మంత్రి మల్లారెడ్డి పై ఐటి

రాజకీయంగా ఎదుర్కొలేకే మంత్రి మల్లారెడ్డి పై ఐటి దాడులు : సుదర్శన్ : శామీర్ పేట్, జనం సాక్షి :
టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొలేకే ఐటీ దాడుల పేరుతో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని శామీర్ పేట్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ అన్నారు. బుధవారం
మంత్రి మల్లారెడ్డి పై ఐటీ దాడుల నిరసిస్తూ ఉమ్మడి శామీర్ పేట మండల టి ఆర్ ఎస్ శ్రేణులు అలియబాద్ చౌరస్తాలో బుధవారం రాజీవ్ రహదారి పై బైఠాయించి రాస్తా రోకో చేసి మోడీ డౌన్ మోడీ డౌన్ బిజెపి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ కార్యదర్శి ఎండి జహంగీర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఎంపీపీ ఎల్లూభాయి, జిల్లా కో ఆప్షన్ జహీర్, వైస్ ఎంపీపీ సుజాత, శామీర్ పేట మండల టి ఆర్ ఎస్ అధ్యక్షుడు విలసాగరం సుదర్శన్, ఎంసీ పల్లి మండల టి ఆర్ ఎస్ అధ్యక్షుడు గుండ్లపల్లి మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి, సతీష్ రెడ్డి శామీర్ పేట మండల టి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షుడు బి నర్సింహ రెడ్డి, సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డి, సింగం ఆంజనేయులు, జాం రవి, కృపాకర్ రెడ్డి, ఎంపీటీసీలు పారుపల్లి నాగరాజు, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, నాయకులు అఫ్జల్ ఖాన్, మురళి గౌడ్ , వెంకట్ రెడ్డి, , చాంద్ పాషా, నర్సింహ రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.
23ఎస్పీటీ -1:మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న నాయకులు