మంత్రి రాసలీలలు.. సిఎం సీరియస్!?
సోషల్ విూడియాతో పాటు ప్రముఖ ఛానల్లో విస్తృతంగా ప్రచారం
రంగంలోకి ఇంటెలిజెన్స్.. అధిష్టానానికి వివరణ ఇచ్చే ప్రయత్నంలో మంత్రి
ప్రశ్నార్థకంగా మారిన మంత్రి భవిష్యత్
రాజీనామా చేయకుంటే భర్తరఫే?!
హైదరాబాద్,అక్టోబరు 30(జనంసాక్షి):కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి రాసలీలలు అంటూ అధికార పార్టీ అనుచరుల ఎలక్ట్రానిక్ ఛానల్‌తో పాటు సోషల్ విూడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాలో నటించడంతో పాటు ఇటీవల కరీంనగర్ సవిూపంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఒక యువనటి బయటపెట్టినట్లు చెబుతున్న వాట్సాప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లతో వ్యవహారం బహిరంగమైంది. సదరు మంత్రి ఈ తతంగాన్నంతా సాదాసీదా వ్యవహారంగా చిత్రీకరించాలని ప్రయత్నించినప్పటికీ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. జరుగుతున్న ప్రచారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిన విషయం తెలియడంతో సదరు మంత్రి సిఎం కెసిఆర్‌ను ప్రత్యక్షంగా కలిసి వివరణ ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అలాంటి ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలం కాకపోవడంతో మంత్రి ఆందోళన చెందుతున్నట్లు అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు మంత్రి తన పదవికి గౌరవప్రదంగా రాజీనామా చేయకుంటే భర్తరఫ్‌కు గురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.