మంత్రి వర్యులు కేటిఆర్ సమావేశమునకు సర్వం సిద్ధం – సభాస్థలి వేదికను పరిశీలించిన ఎమ్మెల్యేలు హుజూర్ నగర్ జనవరి 5 (జనంసాక్షి): తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హుజూర్ నగర్ సమావేశమునకు సర్వం సిద్ధం చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ లు తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని సభా వేదికను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగణా రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ హుజూర్ నగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్థానిక శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వేలకోట్ల అభివృద్ధి పనుల శ్రీకార కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రి, రామస్వామి గుట్ట వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పరిశీలన, ఎస్ టి ఓ ఆఫీస్, బస్తీ దవఖానలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సభా వేదికపై మాట్లాడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథరెడ్డి, మున్సిపల్
మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి వర్యులు కేటిఆర్ సమావేశమునకు సర్వం సిద్ధం




