– కార్మికుల ఇబ్బందులు ఉద్యమ నేతలకు పట్టవా?
– రాష్ట్రంలో విచిత్ర పాలన నడుస్తోంది
– కార్మికులకు కాంగ్రెస్ పక్షాన ఉత్తమ్ హావిూ ఇవ్వాలి
– కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్, నవంబర్26(జనం సాక్షి) : ఆర్టీసీ కార్మికులను చూస్తుంటే బాధ కలుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా? చనిపోయారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విచిత్ర పాలన నడుస్తోందని, రాష్ట్రంలో అసలు ప్రజలు ఉండొద్దా? అని అన్నారు. తెలంగాణలో పరిస్థితి చూసి ఉద్యమ నేతలకు సిగ్గనిపించడంలేదా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టినందుకు చరిత్రహీనులుగా మిగిలిపోతారని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపట్ల మానవత్వంతో వ్యవహరించాలని జగ్గారెడ్డి కోరారు. రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా? చనిపోయారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోమని కూడా ఐఏఎస్ అధికారులే ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఉద్యమంలో కార్మికులను రెచ్చగొట్టిన గంటా చక్రపాణి, మ్లలెపల్లి లక్ష్మయ్య, అల్లం నారాయణ, స్వావిూ గౌడ్, దేవీప్రసాద్, విటల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమయ్యారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగ నేతలు రవీందర్, మమత మాత్రం సీఎంకు మిఠాయిలు తినిపిస్తున్నారని, ఉద్యమ నాయకులకు సిగ్గనిపించడం లేదా.. విూలో చీము, నెత్తురు లేదా.. ఇందుకేనా తెలంగాణ తెచ్చింది అని ప్రశ్నించారు. ఆనాడు ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టినందుకు చరిత్ర హీనులుగా మిగులుతారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మానవత్వంతో ఆలోచించాల,ఇ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రైవేతీకరణ రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలని, కార్మికులకు కాంగ్రెస్ పక్షాన హావిూ ఇవ్వాలని ఉత్తమ్, భట్టికి విజ్ఞప్తి చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
మంత్రులు ఉన్నారా.. చనిపోయారా?




