జనంసాక్షి , మంథని : బీజేపీ జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ , బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బూడిద తిరుపతి మంగళవారం బిజెపి పార్టీలో చేరారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ లో చేరికల కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి హాజరై ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బూడిద తిరుపతి కి కండువా వేసి బీజేపీ పార్టీ లోకి ఆహ్వానించారు. వారితో పాటు సుమారు 100 మంది నాగారం, తదితర గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నుండి యువకులు బిజెపి పార్టీలో ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. మంథనిలో కాంగ్రెస్, బి ఆర్ఎస్, చీకటి పాలనకు చరమగీతం పాడి మంథనిలో సునీల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేస్తామని పార్టీలో చేరిన వారు వెల్లడించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ…నాగారం తదితర గ్రామాల నుండి పెద్ద ఎత్తున తిరుపతి గతో కలసి బిజెపి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మంథని ప్రాంత ప్రజానీకం మార్పును కోరుకుంటున్నారని, ముందు ముందు మరింత బలపడుతూ మంథని బిజెపి పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మన ప్రాంతం నుండి బొగ్గు ఇసుక నీళ్లు తరలించుకుంటూ పోతూ లక్షలాది రూపాయలు సంపాదించుకున్న నాయకులు మంథని ప్రాంతాన్ని మాత్రం ఏ మాత్రం అభివృద్ధి చేయడం లేదని , తెల్లారి లేస్తే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరినొకరు విమర్శలు చేసుకోవడమే తప్ప ఏ ఒక్క అభివృద్ధి పనులలో పోటీ పడడం లేదన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ మాట్లాడుతూ.. మంథని లాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా బిజెపి పార్టీ బలపడుతున్నందుకు ఆనందంగా ఉందని, ఇంత పెద్ద ఎత్తున నాయకులు బిజెపి పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో మంథనిలో బిజెపి జెండా గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మంథని పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్, అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్,బి ఎస్ ఏ నియోజకవర్గ ఇన్చార్జ్ చిలువరి సతీష్ , మండల ఇన్చార్జులు విరబోయిన రాజేందర్ , తోట మధుకర్, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్ జీ, బోగోజు శ్రీనివాస్, ములమూరి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు బూడిద రాజు, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బోయిని నారాయణ, సీనియర్ నాయకులు కోరబోయిన మల్లికార్జున్, చిరురాల మధుకర్ రెడ్డి, ఎడ్ల సాగర్,కాసర్ల సూర్య, బోసెల్లి శంకర్, బొల్లంపల్లి లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.




