Wednesday, 4 November 2026

మంథని ఆలయాల్లో మన్యు సూక్తపూర్వ అభిషేకం – వేద పండితులతో కార్యక్రమ నిర్వహణ

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి , మంథని :శోభ కృత్ నామ సంవత్సరంలో సమస్త జీవరాసులు సుఖ సంతోషాలతో జీవించాలనే సంకల్పంతో పట్టణంలోని పెంజేరు కట్ట హనుమాన్ దేవాలయాల్లో మన్యు సూక్త పూర్వ అభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణ అర్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 30 మంది వేద పండితులు పాల్గొన్నారు. రోజురోజుకు పెరుగుతున్న సూర్యుని యొక్క తాపం తగ్గి వాతావరణం చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వేద పండితుడు అవధానుల పురుషోత్తం తెలిపారు. అదే విధంగా మంథని పట్టణంలోని అన్ని వీధుల్లో గల హనుమాన్ దేవాలయాల్లో ఇదే రకమైన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వేద పండితులు అవధానుల నరసయ్య, గట్టు ఉమాపతి, శ్రీరంభట్ల సదాశివ్, ఆరంభట్ల ప్రవీణ్ శర్మ, మహావాది విజయ్ కుమార్, మహావాది శివ శర్మ, శ్రీలంబట్ల శ్రీపాద, పల్లి గంగాధర్, శ్రీరామ్ బట్ల సదాశివ్, భూషణ్, నారంభట్ల ప్రవీణ్ చిలప్పగారి శివ తదితరులు పాల్గొన్నారు.