Wednesday, 4 November 2026

మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు

 

 

 

 

 

 

 

జనం సాక్షి , మంథని : మంథని మున్సిపల్ పరిధిలోని అయ్యగారు చెరువుకు ఇరువైపుల, చెరువు కింద నుండి గోదావరి రోడ్డు దాకా రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుమ్మ చెట్ల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలియజేయడంతో వెంటనే స్పందించిన శ్రీధర్ బాబు తన సొంత ఖర్చులతో జెసిబితో 2 రోజుల పాటు రోడ్డుకు ఇరువైపుల ఉన్న పొదలను, చెట్లను తొలగించారు. దీంతో సంబంధిత రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ.. మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.