మంథని నియోజక వర్గం పై సీఎం కేసీఆర్ వరాల జల్లు – కాటారం – పెద్దపల్లి, మంథని – ఓడేడ్, వెంకటాపూర్ బీటీ రైన్యూవల్స్ కు నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ

జనంసాక్షి మంథని : మంథని నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాది అని మాటిచ్చిన ముఖ్యమంత్రి కేసీయార్ మంథనిపై వరుసగా వరాల జల్లు కురిపిస్తున్నారు. శుక్రవారం కాటారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు జీవో జారీ చేయగా శనివారం బీటీ రిన్యూవల్స్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. అందులో బ్యాగంగా కాటారం – పెద్దపల్లి ప్రధాన రహదారి, మంథని – ఓడేడ్, ఎగ్లాస్ పూర్ – ఖమ్మంపల్లి, వెంకటాపూర్ రహదారులకు నిధులు మంజూరు చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ విజ్ఞప్తి మేరకు సీఎంవో నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. ఏకంగా జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ లెటర్ ఫ్యాడ్ పైనే సీఎంవో కార్యాలయ అధికారులు సంబంధిత శాఖకు ఎండార్స్ చేసి పంపారు.