Monday, 2 November 2026

మంథని పట్టణ సుందరీకరణకు పకడ్బందీ చర్యలు – అభివృద్ది పనులు త్వరగా పూర్తి చేయాలి – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ సుందరీకరణకు పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. బుధవారం మంథని మున్సిపల్‌ పరిధిలోని 7వ వార్డు రావులచెరువు కట్టలో ఆయన పర్యటించి డ్రైనేజీ, ఇతరత్రా అభివృధ్ది పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంథని మున్సిపాలిటీని జిల్లాలో ఆదర్శంగా నిలుపాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇందులో బాగంగా పట్టణంలో అనేక సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, రావులచెరువు కట్ట, బొక్కలవాగు కట్ట, తమ్మిచెరువు కట్ట ప్రాంతాల్లో సీసీ రోడ్లు, వాకింగ్‌ ట్రాక్‌లు నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. అయితే వార్డుల్లో చేపట్టిన డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలను తర్వగా పూర్తి చేయాలని, వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. రావుల చెరువు కట్ట ప్రాంతంలోని డ్రైనేజీని పూర్తి చేసి మురుగునీటిని తరలించేలా పనులు పూర్తి చేయాలని సూచించారు.