జనంసాక్షి, మంథని : ఏఐసీసీ కార్యదర్శి, శాసనసభ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.50 మందికి పైగా యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు రక్త దానం చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, పెంటరిరాజు, ఆర్ల నాగరాజు మాట్లాడుతూ.. శ్రీధర్ బాబు గారు ఇలాంటి జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని శ్రీధర్ బాబు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తిని వారు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించాలని ఈ ప్రాంత అభివృద్ధిలో వారి అడుగుజాడల్లో నడవడానికి యువజన కాంగ్రెస్ ఎల్లవేళల సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెగ్గం రాజేష్ శశిభూషణ్ కాచే పెండ్రు రమ,చొప్పకట్ల హన్మంతరావు సురేందర్ రెడ్డి జంజర్ల శేఖర్ ,నూకల బాపయ్య, అజీమ్ ఖాన్ ,గోటికార్ కిషన్ మంథని సత్యం ,ఐలి శీను, బండారి ప్రసాద్ మంథని రాకేష్ ,వేల్పులరాజు,ఉదరి శంకర్,ఐలి ప్రసాద్ యువజన కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం




