Thursday, 5 November 2026

మందమర్రిని గ్రామపంచాయతీగా మార్చండి

 

 

 

 

 

 

మందమర్రిని ఇదివరకు ఉన్న విధంగా గ్రామపంచాయతీని చేయాలని ఈరోజు ఊరు మందమర్రి, నార్లపూర్, ఊరు రామకృష్ణాపూర్ గ్రామస్తులు మంచిర్యాల జిల్లా కలెక్టరు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు..భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏజెన్సీ ప్రాంత హక్కులను పరిరక్షించుకోవడానికి మూడు గ్రామాల వాసులమైన ఊరు మందమర్రి,నార్లపూర్, ఊరు రామకృష్ణాపూర్ వాసులం అందరం కలిసి ఇదివరకు ఏదైతే మందమర్రి గ్రామ ప ంచాయతీ ఉండేనో అదే విధంగా తిరిగి మళ్లీ మందమర్రిని గ్రామపంచాయతీగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదనీ మా చట్టాలను రక్షించుకోవాలని ఉద్దేశంలో భాగంగా మాత్రమే మందమర్రి గ్రామపంచాయతీ చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. మందమర్రిని గ్రామపంచాయతీగా చేసే వరకు నిరంతరం పోరాటం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఉదృతం చేయడానికి మేమంతా కలిసి పూనుకున్నామని అన్నారు. ఊరు మందమర్రిని గ్రామపంచాయతీ చేసిన తర్వాత మందమర్రి మున్సిపాలిటీకి ఎలక్షన్లు జరిపించుకోవాలని లేని పక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులూ మేసినేని అరుణ్ కుమార్, పాలమాకుల భీమ్సేన్, ఎండి ముజాహిద్, భూనేని కిషోర్ కుమార్, కూన సత్యం, సేనేని ప్రదీప్, గుండం శ్రీరామ్, సాగే శ్రీనివాస్, భైరనేని సత్యనారాయణ భూనేని కిషన్, రెడ్డి ఆకాష్ , బైర్నేని హరి , మేసినేని మల్లేష్, సెనేని మల్లేష్ నాగుల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.