Wednesday, 4 November 2026

లోక్ అదాలత్ ద్వారా పలు కేసులు పరిష్కారం

 

 

 

 

మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 11,జనంసాక్షి :మెట్పల్లి మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో శనివారం రోజున లోక్ అదాలత్ ద్వారా సివిల్ కేసులు మరియు క్రిమినల్ పలు కేసులు పరిష్కారం జరిగినవి అని మెట్పల్లి మున్సిఫ్ కోర్టు మెజిస్ట్రేట్ వినీల్ కుమార్ తెలిపారు,లోక్ అదాలత్ ద్వారా చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి కేసులను పరిష్కారం చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యక్షుడు రాంబాబు, ప్రధాన కార్యదర్శి ఆనంద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాధవి, న్యాయవాదులు వెంకట నరసయ్య ,వెంకటేశ్వర్లు, రాజ్ మహమ్మద్, వడ్డేపల్లి శ్రీనివాస్, వెంకటస్వామి, శంకర్ రెడ్డి, హఫీజ్, భానుమూర్తి, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు