మట్టపల్లి భౌతిక కాయానికి నివాళి అర్పించి ఆర్థిక సహాయం అందజేత – గెల్లి అర్చనరవి
హుజూర్ నగర్ డిసెంబర్ 10 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని జంగాలగూడెంలో గంజాయి మట్టపల్లి గుండెపోటుతో మరణించగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి, టిఆర్ఎస్ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, మట్టపల్లి భౌతిక కాయానికి నివాళి అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శనివారం టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గెల్లి రవి తక్షణ సహాయం క్రింద 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు కొమ్ము శ్రీను, జక్కుల, శంబయ్య, మలిదశ ఉద్యమకారుడు ఎడ్ల విజయ్, మహిళా సంఘ ప్రధాన కార్యదర్శి గూడెపు దీప, గంజాయి బాలు, జక్కుల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లి భౌతిక కాయానికి నివాళి అర్పించి ఆర్థిక సహాయం అందజేత – గెల్లి అర్చనరవి




