Wednesday, 4 November 2026

విజయీభవ ద్వారా విద్యార్థులలో జీవన నైపుణ్యాలు అభివృద్ధి

విజయీభవ ద్వారా విద్యార్థులలో జీవన నైపుణ్యాలు అభివృద్ధి
– చారుగుండ్ల రాజశేఖర్ కృషి చేయటం అభినందనీయం
– ప్రధాన కార్యదర్శి వంగవేటి లోకేష్

మునగాల, డిసెంబర్ 10(జనంసాక్షి): విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో “నైతిక విలువలు, జీవన నైపుణ్యాలు” అనే అంశం మీద కార్యక్రమం కేజీబీవీ మునగాలనందు జ్యోతి అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ వ్యక్తిత్వ వికాసనిపుణులు, విజయీభవ సంస్థ వ్యవస్థాపకులు చారుగుండ్ల రాజశేఖర్ హాజరై విద్యార్థులకు జీవన నైపుణ్యాలు మీద శిక్షణ ఇచ్చారు. జ్యోతిరెడ్డి, అరునిమాసిన్హా, జెస్సిక కాక్స్ లను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రేరణ ఇచ్చారు. కష్టాలు, అపజయాలు మనిషిలోని శక్తీయుక్తులను వెలికి తీస్తాయని తెలిపారు. అభిరుచి పరీక్ష నిర్వహించి విజేతలకి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎస్.ఓ జ్యోతి, సీఆర్టీలు పాల్గొన్నారు.