Tuesday, 3 November 2026

మణిపాల్‌ యూనివర్శిటీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం

మణిపాల్‌: మణిపాల్‌ విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌ చదువుతున్న కేరళకు చెందిన ఒక విద్యార్థిని గురువారం రాత్రి అత్యాచారానికి గురైంది. షాక్‌కి గురైన ఆమె వివరాలేవీ చెప్పలేకపోతోందని, ఇంటెన్సిప్‌ కేర్‌లో చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు. యూనివర్శిటీ లైబ్రరీ నుంచి రాత్రి 11.30 ప్రాంతంలో ఆమె ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్‌ తన సహచరులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అమెను వారు ఇంటి పరిసరాల్లో వదిలివెళ్లగా రూమ్‌ మేట్స్‌ గుర్తించి వెంటనే ఆస్పత్రివర్గాల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *