Monday, 2 November 2026

మత్తయ్య క్వాష్ పిటిషన్‌ విచారణ వాయిదా

ఓటుకు నోటు కేసులో ఏ-4 నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ సోమవారంకు వాయిదా పడింది. ఈమేరకు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ మత్తయ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో నిందితుడు మత్తయ్య తెలంగాణ రాష్ట్ర ఏసీబీకి చిక్కకుండా తప్పించుకు తిరుగుతోన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *