హైదరాబాద్, జూన్ 25 : ఉమ్మడి రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న ఫోన్‌ట్యాపింగ్, సెక్షన్ 8 వివాదాలపై కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది.ఫోన్‌ట్యాపింగ్ అంశం తీవ్ర పరిమాణాలకు దారి తీసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో సెక్షన్8 అమలు చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెక్షన్ 8 అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అటార్నీ జనరల్ సలహాను గవర్నర్ కోరిన విషయం తెలిసిందే.
ఈక్రమంలో సెక్షన్-8పై రెండుమూడు రోజుల్లో అధికారికంగా నోటిఫికేషన్ విడుదలయ్యే అకాశం ఉన్నట్లు ససమాచారం. దీనికి సంబంధించి మరోసారి కేంద్ర హోంశాఖ, ప్రధానితో భేటీ అయ్యి పరిస్థితులను వివరించేందుకు ఈరోజు సాయంత్రం గవర్నర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.




