Monday, 2 November 2026

మత్స్య పారిశ్రామిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక*

మునగాల, జూన్ 4(జనంసాక్షి): మునగాల గ్రామ మత్స్య పారిశ్రామిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నికను మునగాల గ్రామ మత్స్య పారిశ్రామిక సంఘం ఎన్నికలనల్ అధికారి బానోతు కృష్ణ శనివారం మునగాలలోని ముదిరాజ్ భవన్ లో జరిగిన మునగాల గ్రామ మత్స్య పారిశ్రామిక సంఘం సమావేశంలో పాల్గొని నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించి అభ్యర్థుల వివరాలను తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. మత్స్య పారిశ్రామిక సంఘం నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా పిట్టల శ్రీను, ప్రధాన కార్యదర్శిగా వేట శివాజి, ఉపాధ్యక్షుడుగా కంటు శ్రీను, డైరెక్టర్లుగా చింతకాయల శ్రీనివాసరావు, చింతకాయల చినసైదులు, పోతురాజు నరసింహారావు, సూరేపల్లి కోటయ్య, అల్లి లింగమ్మ, మామిడి యలమంచమ్మ ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగవలసిన మత్స్య సంఘం ఎన్నికలు.. కొన్ని అనివార్య కారణాలవల్ల 8 సంవత్సరాల తర్వాత జరగడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.