డిఎస్పీ శంకర్ రాజ్ కు ఘన సన్మానం
డిఎస్పీ శంకర్ రాజ్ కు ఘన సన్మానం
జహీరాబాద్ జూన్ 4 (జనంసాక్షి) జహీరాబాద్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి గా ఇటీవల కొంత కాలం క్రితం వరకు విధులు నిర్వహించి బదిలీపై హైదరాబాద్ కు వెళ్లిన డిఎస్పి గాండ్ల శంకర్ రాజుకు అతిథి హోటల్ లో పలువురు ఆయన అభిమానులు శాలువా, పూలమాలలతో సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమ నాయకులు ఢిల్లీ వసంత్, రైల్వ్ బోర్డు మెంబర్ షేక్ ఫరిద్ మాట్లాడుతూ ఉద్యోగుల కు బదిలీలు సహజమే నాని వారి ఉద్యోగ సమయంలో చేసిన సేవలు మాత్రం ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోతాయి అన్నారు.కరోనా కష్ట కాలంలో ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివి అన్నారు. కార్యక్రమంలో నేస్తం సంస్థ జిల్లా అధ్యక్షుడు దన్ రాజ్ గౌడ్, బీసీ సంఘం నాయకులు పెద్దగొల్ల నారాయణ, అడ్వాకేట్ మణిక్ పటేల్ మనియర్ పల్లి రాజు కుమార్, జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడు డాక్టర్ శివ బాబు, బెంజిమెన్ రాజ్,రాయికోటి నర్సిములు ఝరాసంగం సర్పంచ్ జగదీశ్వర్, పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక విద్యా సంస్థల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.