మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌

కరీంనగర్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్‌ మాసం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. మంగళవారం టీఎన్‌జీ భవన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ముఖ్య అతిథిగా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌, ఎస్పీ వి. రవీందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులు అత్యంత ప్రవితమైందని భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారు. రంజాన్‌ మాసం ఉపవాస దీక్షలు కొనసా గించడం భక్తికి నిదర్శనం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు హమీద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సంహా స్వామి, జిల్లా నాయకులు బి. రామారావు, లక్ష్మణ్‌ రావు, జిల్లా మాజీ అధ్యక్షులు, నగర ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు, ముస్లిం సోదరులు, తదితరులు  పాల్గొన్నారు.