మద్దిమడుగు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
జనం సాక్షి: మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. డిసెంబర్ 4 నుంచి 8 వరకు నిర్వహించే ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా తెలిసే విధంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు హైదరాబాద్ ఎమ్మెల్యే సొంత నివాసంలో బుధవారం నాడు మద్దిమడుగు ఆలయ సిబ్బంది చైర్మన్ విష్ణుమూర్తి ఎమ్మెల్యే గువ్వల బాలరాజును మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో సన్మానించి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలలో ఎలాంటి ఆటంకం జరగకుండా వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులు ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని ఆదేశించారు ఈ కార్యక్రమానికి హాజరవుతానని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మద్దిమడుగు చైర్మన్ విష్ణుమూర్తి, ఆలయ సిబ్బంది ఈవో రంగాచారి, జూనియర్ అసిస్టెంట్ జైపాల్ రెడ్డి, వీర్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు
మద్దిమడుగు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి




