Monday, 2 November 2026

సత్తుపల్లి RC

సత్తుపల్లి RC ( జనం సాక్షి )సత్తుపల్లి RC ( జనం సాక్షి )రైతుసోదరులతో కలిసి రైతు సమస్యలపై కదంతొక్కిన మాజీ మంత్రి సంభాని భారీస్ధాయిలో హాజరైన నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TPCC) అద్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు తెలంగాణలో రైతు సోదరులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు (ధరణి , రైతు రుణమాఫీ,రైతు భీమా, పోడు భూములు, ధాన్యం, మిరప, పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించుట) లను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరుతూ మాజీ మంత్రివర్యులు,Tpcc సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గ Tpcc సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి గారితో కలిసి సత్తుపల్లి నియోజకవర్గంలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి భారీస్థాయిలో సుమారు 500 మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలతో ర్యాలీగా పాదయాత్ర చేస్తూ రైతుసోదరులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి  ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమము సత్తుపల్లి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించి తెరాస మరియు బిజేపి పార్టీల కుట్ర రాజకీయాలని ప్రజలకు వివరించి, రానున్న ఎన్నికల్లో రైతువ్యతిరేక పార్టీలను భూస్థాపితం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం మండల రెవిన్యూ అధికారికి (MRO) మెమొరాండం ఇచ్చి రైతు సమస్యలని వారి దృష్టికి తీసుకువెళ్లి రైతు సోదరులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమనికి TPCC నియోజకవర్గ పరిశీలకులు యలమంచిలి శ్రీనివాస్ గారు ముఖ్యఅతిథిగా హజరవ్వగా  బ్లాక్ కాంగ్రెస్ నాయకులు దగ్గుల రఘుపతి రెడ్డి, గోళ్ల అప్పారావు, కల్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివవేణు, సత్తుపల్లి టౌన్ కాంగ్రెస్ అద్యక్షులు సాల్మన్ రాజు, వేంసూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చెలికాని రాజబాబు, తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్, స్టేట్ Sc Dpt కన్వీనర్ కొండూరు కిరణ్, రాష్ట్ర మాజీ యువజన కాంగ్రెస్ నాయకులు రామిశెట్టి మనోహర్ నాయుడు, నాయకులు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుచ్చకాయల సోమిరెడ్డి, నియోజకవర్గంలోని ఉపాధ్యక్షులు, నియోజకవర్గంలోని వర్కింగ్ ప్రెసిడెంట్లు, నియోజకవర్గంలోని మహిళా కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గంలోని యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజప్రతినిధులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.