పెనుబల్లి, జనవరి 28(జనం సాక్షి)గుత్తి కోయలను మోసంచేసి వారి సొమ్మును స్వాహా చేసిన ఇండియన్ కిసాన్ యూనియన్ స్టేట్ వైస్ చైర్మన్ మద్దిశేట్టి సామేలు పై కేసు నమోదు చేసి నట్లు వి ఎం బంజర్ ఎస్ ఐ జి. సూరజ్ తెలిపారు, వివరాలకుపెనుబల్లి మండలం కె.డబ్లూ చౌడారం గ్రామ అటవీ ప్రాంతంలో చత్తీష్ ఘడ్ నుండి వలస వచ్చి జీవనం సాగిస్తున్న గుత్తి కోయలకుసామేలు250 ఏకరాలకు పోడు పట్టాలు హక్కు పత్రాలు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పిస్తానని నమ్మించి 11 లక్షల 95 వేలు వసూలు చే సాడని.తమ అమాయకత్వాన్ని అసరగా తీసుకొని డబ్బులు వసూలు చేసి పట్టాలు ఇప్పించకుండా మోహం చాటేశాడని వి.ఎం.బంజర్ పోలీస్ స్టేషన్ లో పొడియం దూల ఫిర్యాదు మేరకుమద్దిశేట్టి సామేలు పై 420,506 ఐ పి సి, ఎస్ సి, ఎస్ టి, సెక్షన్ల కింద కేస్ నమోదు చేసి దర్యాప్తు చెపట్టిన ట్లు ఎస్ ఐ తెలిపారు.




