Monday, 2 November 2026

మద్నూర్ లో అంగన్ వాడి టీచర్లు ,ఆయాల సమ్మె

జుక్కల్, మార్చి 01,( జనం సాక్షి),
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని సిడిపిఓ కార్యాలయం ముందు బుధవారం తమ సమస్యల పరిష్కారం కోసం ఆంగన్ వాడి టీచర్లు, ఆయాలు సమ్మె చేపట్టారు.ఈ సంధర్భంగా మద్నూర్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు చంపబాయి, ప్రధాన కార్యదర్శి అనసూయ మాట్లాడుతు అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనం 26,000రూపాయలు ఇవ్వాలని, పెన్షన్, గ్రాడ్యుటి సౌకర్యం కల్పించాలని, మిని ఆంగన్ వాడిలను మెయిన్ ఆంగన్ వాడిలుగా గుర్తించాలని, బకాయి పడ్డ టిఏ, డియేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ఆంగన్వాడిలకు సంబంధం లేని పనులు చెప్పవద్దని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.వారు 20డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సిడిపిఓకు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటి యు రాష్త్ర కమిటి పిలుపు మేరకు మూడురోజుల పాటు చేపట్టే సమ్మెలో భాంగంగా మొదటి రోజు జుక్కల్ నియోజక వర్గంలో ని మద్నూర్ ప్రాజెక్ట్ పరిధిలోని సిడిపీఓ కార్యాలయం ముందు సమ్మె చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో
పెద్ద కొడప్ గల్ సెక్టర్ అధ్యక్షురాలు విజయ, వడ్లం సెక్టర్ అధ్యక్షురాలు వనజ,డోoగిలి మండల అధ్యక్షురాలు సచిత, రాజశ్రీ, జుక్కల్ సుమలత, లక్ష్మి, బిచ్కుంద గంగవ్వ, శారద లతో పాటు ఐదు మండలాలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.