లోకేశ్వరం (జనం సాక్షి) హైందవ సంస్కృతిలో ఆవుకు ఉన్నటువంటి ప్రాధాన్యత దేనికి లేదు అటువంటి ఆవు పై కన్నెర్ర చేసి సభ్య సమాజం తలదించుకునేలా మద్యం మత్తులో ఓ యువకుడు ఆవు పై అత్యాచారం చేసిన ఘటన లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో చోటు చేసుకుంది ఎస్ ఐ సాయి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు పిప్రి గ్రామంలో సాయన్న అనే వ్యక్తి నూతన గృహానికి మార్బుల్స్ పని గత కొన్ని రోజులుగా చేస్తున్నారు బుధవారం రాత్రి సదరు వలస కూలి మద్యం మత్తులో ఇంటి ముందర ఉన్న అవును నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లి కిటికీకి బంధించి అత్యాచారానికి ఒడిగట్టడముతో ఆవుకు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు ఆవు యజమాని అభ్యర్థన మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రక్తనమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాను
పశువైద్యాధికారి…. డాక్టర్ జెస్సిక
పోలీసుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని ఆవు మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం కాగా ఆవు యొక్క రక్తపు నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడం జరిగిందని ఆమె తెలిపారు నివేదిక రాగానే అసలు విషయం బయటపడుతుందని ఆమె పేర్కొన్నారు
పోలీసుల అదుపులో వలస కూలీలు .. ఎస్సై సాయి కుమార్
పిప్రి గ్రామంలో ఆవు పై అత్యాచారం జరిగిన అత్యాచార నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్ఐ తెలిపారు పశువైద్యాధికారి ఆధ్వర్యంలో రక్తపు నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఇవ్వడం జరిగింది తుది నివేదిక రాగానే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు




