జహీరాబాద్ జనవరి 25 ( జనం సాక్షి) జహీరాబాద్ మండలంలోని శేకపూర్ గ్రామంలో బుధవారం డిడి ఎస్ ఆధ్వర్యంలో పాత పంటల జాతర ను ఘనంగా నిర్వహించారు ఏండ్ల బండ్ల తో గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.జాతరకు వచ్చిన అతిధులు ఎంపీటీసీ నర్సిములు చేత జ్యోతి ప్రజ్వలన మరియు మహిళా రైతులు చిరుధాన్యాలపై పాడిన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఫ్యయాజ్ ఇస్మాయిల్ మజీద్ లు డిడిఎస్ సిబ్బంది, కి శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ డీడీ ఎస్ సూపర్ వైజర్ విజయ లక్ష్మి, సిబ్బంది చుక్కమ్మ,నర్సమ్మ, చంద్రమ్మ, కమలమ్మ,బాలన్న వినయ్ కుమార్ తక్కారెడ్డి మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు.




