రాజోలి 10 ప్రిబ్రవరి(జనం సాక్షి).మొక్కజొన్న రైతుల కోసం ఆందోళన చేసిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
…..తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద 5 గంటల పాటు ఎండలో బైటాయింపు.విషయం తెలుసుకుని భారీగా చేరుకున్న రైతులు
…లిఫ్ట్ మోటార్లు ఆన్ చేసి నీటి విడుదల చేసేందుకు సిద్ధమైన సంపత్.లిఫ్ట్ se శ్రీనివాస్ సంపత్ తో ఫోన్ లో మాట్లాడి నీటి విడుదల కు హామ…చెప్పిన సమయానికి నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున రైతులతో రాస్తారోకో చేస్తానని హెచ్చరికఆరుగాలం కష్టపడి పండించిన పంట నీరు లేక ఎండిపోతుంటే రైతుల పడే గోస ఈ చేత కానీ ప్రభుత్వం కు వినపడదా అని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. శనివారం ఆయన మండలంలో ని తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద మొక్కజొన్న రైతుల కోసం ధర్నా చేపట్టారు. గత రెండు వారాలుగా లిఫ్ట్ నుండి సరైన నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు అని.గత పది రోజులుగా లిఫ్ట్ నీరు లేకపోగా..అంతకుముందు వారం రోజుల పాటు వారబంది తో సరైన నీరు అందలేదని దీంతో రాజోలి వడ్డేపల్లి, మనోపాడ్,ఉండవెళ్లి,అలంపూర్ మండలాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా ఎండు ముఖం పట్టిందన్నారు.తెలంగాణ కు రావాల్సిన ఇండెంట్ ను ఆంద్రప్రదేశ్ తీసుకువెలితే ఇక్కడి రైతుల అవసరాలు పక్కన బెట్టి వారికి నీటిని ఇచ్చి ఇప్పుడు ఇండెంట్ పెట్టామని, ap వాళ్ళను అడుగుతున్నామని చెప్పటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. అందుబాటులో లిఫ్ట్ నిర్మించుకుని,ఆర్డీఎస్ రైతులకు నీరు అందించకుండా ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని అన్నారు. నియోజకవర్గ0లో 15 వేల ఎకరాల మొక్కజొన్న సాగు అవుతుండగా..మిరప జొన్న పంటలు కూడా నీరు లేక ఎండుతున్నాయని అన్నారు.ఈ రెండు రోజుల్లో నీరు వదలకుంటే పంటలు పూర్తి గా ఎండిపోయి కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతుందని అన్నారు. 5 గంటల ధర్నా అనంతరం లిఫ్ట్ వద్దకు చేరుకున్న అధికారులు se శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడించగా..రేపటి లోగా మోటార్లు రన్ చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన సమయానికి నీరు ఇవ్వకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
—————————————
కాగా రైతుల గోస ను తెలుసుకున్న రైతుల పక్షపాతి, రైతు ముద్దు బిడ్డ సంపత్ కుమార్ తుమ్మిళ్ల లిఫ్ట్ దగ్గరకు వెళ్లి అధికారులతో మాట్లాడతామని చెప్పటం,వినకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించటంతో అధికార పార్టీ నాయకులు డ్రామాలు మెదలు పెట్టారు. ఇప్పుడే అధికారులతో మాట్లాడామని రెండు రోజుల్లో నీరు వస్తుంది అని చెప్పి నమ్మే ప్రయత్నం చేశారు.సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తను కూడా రైతులు పెద్దగా పట్టించుకోకుండా సంపత్ కుమార్ చేస్తున్న ధర్నా వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆయన చేసిన ధర్నా విజయవంతం కావటం.అధికారులు ఎంత ఆలస్యంగా వచ్చినా రైతుల కోసం ఆయన 5 గంటల పాటు ఎండలో కూర్చొని చివరగా అధికారులతో చర్చించి వెళ్లటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు..




