మన అమ్మ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లాలో తక్కువ ఖర్చుతో మొట్టమొదటి సారిగా పొస్టీరియార్ కృషియేట్ లిగమెంట్ ఆపరేషన్ ను జిల్లా కేంద్రంలోని మన అమ్మ హాస్పిటల్ లో విజయవంతంగా నిర్వహించారు.ఆత్మకూర్(ఎస్) గ్రామానికి చెందిన నరిగే నరేష్ కు ఆక్సిడెంట్ కావడంతో మోకాళ్ళలో నరం తెగడంతో పొస్టీరియార్ కృషియేట్ లిగమెంట్ రీకనెక్షన్ ఆర్టిస్కోపిక్ ఆపరేషన్ చేయాల్సి రావడంతో మన అమ్మ హాస్పిటల్ లో సంప్రదించగా, డాక్టర్లు ప్రత్యేకంగా హాస్పిటల్ లో ఆపరేషన్ ను నిర్వహించారు.భారీ ఖర్చుతో కార్పొరేట్ హాస్పిటల్ లోనే సాధ్యమయ్యే ఈ ఆపరేషన్ ను తక్కువ ఖర్చుతో మన అమ్మ హాస్పిటల్ లో విజయవంతంగా నిర్వహించడం పట్ల పేషేంట్ బంధువులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఆపరేషన్ లో డాక్టర్ సుధీర్ కుమార్ , డాక్టర్ సుకేశ్ రావ్ , డాక్టర్ నాగేందర్ పాల్గొని ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు.