Wednesday, 4 November 2026

మన ఆఫీస్ నూతన కార్యాలయం ప్రారంభించిన ఎంపీపీ దూదిపాల రేఖ

 

 

 

 

 

 

 

శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి జనవరి 26 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ప్రజల అభిష్టం మేరకు, సేవా కార్యక్రమాలు చేయటం కోసం కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మన ఆఫీస్ నూతన కార్యాలయమును ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రజలు అందరూ తమ సమస్యలు వుంటే నేరుగా వచ్చి చెప్పుకోవచ్చని, వాటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు మన ఆఫీస్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ కొండమల్లేపల్లి మండలంలో ప్రజల సమస్యలు చాలా ఉన్నాయని ఒక్కొక్క సమస్యను ఛాలెంజ్ గా తీసుకోని మండల ప్రజల కష్టాలు తీర్చాలని తెలిపారు మండలంలో ముఖ్యంగా ఆరోగ్యం, చదువు, ఉపాధి పరంగా ప్రజలు అభివృద్ధి చెందాలని కోరారు కొండమల్లేపల్లి మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు అవసరమయ్యే వాటికోసం ఆర్థిక సహాయం చేశామని, కొండమల్లేపల్లి పీ హెచ్ సి అన్ని రకాల హంగులతో ప్రజల ఆరోగ్యానికి అవసరమయ్యే అనుభవజ్ఞులైన డాక్టర్లను, మందులను అందుబాటులో ఉంచామని నూతనంగా పెయింటింగ్ చేయించామని రానున్న రోజులలో 24 గంటలు వైద్య సదుపాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు వీటితోపాటు 24 గంటలు అందుబాటులో ఉండే అధునాతన అంబులెన్స్ సౌకర్యం ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కరోనా సమయంలో కూడా అన్ని వర్గాల ప్రజలకు అధికారులకు మీడియా మిత్రులకు వ్యాపారులకు తమ సహాయం అందించామని తెలిపారు తమ సొంత నిధులతో కొండమల్లేపల్లి బస్టాండ్ ను అధునాతనంగా తీర్చిదిద్దామని, పరిసరాలను పరిశుభ్రం చేయించి, బస్టాండ్ చుట్టూ మొక్కలు నాటించి పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేపించి ప్రయాణికులు సేదతీరే విధంగా చక్కటి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించామని తెలిపారు వీటితోపాటు బస్టాండ్ లో టీవీలు ఫ్యాన్లు వాటర్ ఫెసిలిటీలు ఇంకా చేపట్టాల్సి ఉందని తెలిపారు గతంలో కొండమల్లేపల్లి బస్టాండ్ కరెంటు బిల్లు కట్టలేక ఎలక్ట్రిసిటీ వారు కరెంట్ కట్ చేసిన సందర్భాలు ఉన్నాయని అటువంటి అంధకారం నుండి బస్టాండ్ చెక్కదిద్దామని తెలిపారు కొండమల్లేపల్లి మండలంలో తమ సొంత నిధులతో గ్రామ గ్రామాన పేద ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించామని, భవిష్యత్తులో కూడా ఇంకా ఇల్లు లేని వారికి కూడా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు కొండమల్లేపల్లి మండలంలో గ్రామాలలో తండాలలో పాఠశాలల ప్రవారి గోడలను నిర్మించామని, పాఠశాలలకు నూతనంగా పెయింటింగ్ చేయించామని, విద్యార్థుల కోసం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని, కొన్ని పాఠశాలలో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయించామని తెలిపారు మేము రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతోనే అధికారం ఉన్న అధికారం