Friday, 6 November 2026

మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలు పలు అభివృద్ధి

మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన దేవరకొండ శాసనసభ్యులు,నల్గొండ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ కొండమల్లేపల్లి డిసెంబర్ 17 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శనివారం నాడు దేవరకొండ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ తమ తండాలను,తమ గూడలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా మిషన్ భగీరథ ద్వార ప్రతి ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు కొండమల్లెపల్లి మండలం గుర్రపు తండా,కేశ్య తాండలలో రూ.40లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఊరు -మన ప్రభుత్వం-మన పథకాలు కార్యక్రమం భాగంగా కొండమల్లెపల్లి మండలం గుర్రపు తండా,కేశ్య తాండలలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని దేవరకొండ శాసన సభ్యులు, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ గుర్తు చేశారు.శనివారం ఊరు -మన ప్రభుత్వం-మన పథకాలు కార్యక్రమం భాగంగా కొండమల్లెపల్లి మండలం గుర్రాపు తండాలో రూ.20లక్షల,కేశ్య తండాలో రూ.20లక్షల పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా తాండలలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ ది అని ఆయన అన్నారు.తమ తండాలను,తమ గూడలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు.గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని ఆయన తెలిపారు.మిషన్ భగీరథ ద్వార ప్రతి ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు అందించడం జరిగింది అని ఆయన తెలిపారు.నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా అని ఆయన అన్నారు.ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు,నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామంటూ.. ఏ పైరవీ చేయకుండానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితోనే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నారని ప్రభుత్వ సంక్షేమం అని ఆయన వివరించారు.తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది అని ఆయన పేర్కొన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు. అంతేగాకుండా, గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం అందజేస్తున్నదని చైతన్యపర్చాలని కోరారు. ప్రతీ గ్రామంలో రైతులను విజ్ఞానవంతులుగా చేసేందుకు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని చెప్పాలని కోరారు. పేదింటి అడబిడ్డల పెండ్లి కోసం కల్యాలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మౌళికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,జడ్పీటీసీ సలహాదారుడు పసునూరు యుగేందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమావత్ దసృ నాయక్,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,బిఆర్ఎస్ జిల్లా నాయకులు నేనావత్ రాంబాబు నాయక్, ఎంపీటీసీ జగన్ నాయక్, ఎంపీటీసీ రాజు రాణి, సర్పంచులు రమావత్ అనిత రాములునాయక్, రమావత్ జ్యోతిదస్రు నాయక్, రమావత్ రాములు నాయక్, గుండెబోయిన లింగం యాదవ్, రమావత్ లలిత భీమ్ సింగ్ నాయక్, ఉప సర్పంచ్ రమావత్ విజయ్ నాయక్, మాజీ ఎంపీటీసీ లాలు నాయక్ రమావత్ తులిసిరామ్, మాజీ సర్పంచ్ శ్రీను నాయక్, నేనావత్ శంకర్ నాయక్, రమావత్ బాల్ సింగ్, ఉప సర్పంచ్ రామావత్ బాలు నాయక్, టిఆర్ఎస్ నాయకులు రమావత్ రాజు నాయక్ మరియు అన్ని శాఖల అధికారులు వివిధ గ్రామాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.