Wednesday, 4 November 2026

మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి

మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి
– సిద్దు రావణ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.
జహీరాబాద్ జనవరి 9 (జనంసాక్షి)
చీకట్లను చీల్చిన జ్ఞాన కిరణం ఫాతిమా బేగం అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం లోని జహీరాబాద్ పట్టణంలో గల బహుజన్ సమాజ్ పార్టీక్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ అధ్యక్షతన ముస్లింల యొక్క ముద్దుబిడ్డ ఫాతిమా వేగం జయంతిని ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆ రోజుల్లో కొంతమంది మూర్ఖులు పనిగట్టుకుని వాస్తవమైన చరిత్రను సమాజానికి తెలియకుండా కావాలనే కుట్రపూరితంగా మరుగున పరిచి నేటి సమాజానికి తెలియకుండా చేశారని మండిపడ్డారు..ఈ కార్యక్రమంలో , జిల్లా ఇన్చార్జ్ బాబురావు, యాదగిరి, శ్రీశైలం ప్రశాంత్, మ్యాతరి నర్సింహులు, చందు సంగమేశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.