Wednesday, 4 November 2026

హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నెహ్రు నాయక్ అభిమానులు

 

 

 

 

 

డోర్నకల్ ఫిబ్రవరి-9 /జనం సాక్షి న్యూస్:తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజ్యాంగ రక్షణకై ప్రజాస్వామ్య పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర డోర్నకల్ నియోజకవర్గంలోని పెద్ద నాగారం స్టేజి నుండి మరిపెడ బంగ్లా మండల కేంద్రం వరకు యాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గ బాధ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ ఆదేశాల మేరకు డోర్నకల్ మండలం ఉమ్మడి గొల్లచర్ల గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బానోత్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో 20 ఆటోల ర్యాలీతో భారీగా తరలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాథ్ సే హాత్ జోడో పాదయాత్ర తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, డోర్నకల్ నియోజకవర్గంలో మాలోత్ నెహ్రు నాయక్ నేతృత్వంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.