కోల్‌కటా: ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త శిబాజీ పంజాను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. మమతా బెనర్జీతోపాటు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ఆయన కోల్‌కటా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసు జారీ అయి ఉంది. ఈమేరకు ఢిల్లీ పోలీసులు శిబాజీని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. శిబాజీ పంజా సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. శిబాజీ అరెస్టు మమతా ప్రభుత్వానికి మరో పెద్ద ఇబ్బంది కానుందని భావిస్తున్నారు.




