Wednesday, 4 November 2026

రాజస్థాన్‌లో బీజేపీ ఎమ్మెల్యేకి స్వైన్‌ఫ్లూ

హైదరాబాద్: రాజస్థాన్‌లో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. ఎమ్మెల్యే సూర్యకాంతకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్టు జోధ్‌పూర్‌లో ఆయనను పరీక్షించిన వైద్యులు నిర్దారించారు. ఈమేరకు రాజస్థాన్ రాష్ట్ర సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా, రాజస్థాన్‌లో మరో ఏడుగురు స్వైన్‌ఫ్లూ వ్యాధి కారణంగా మృత్యువాతపడ్డారు. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 4318 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా వారిలో 212 మంది మృతిచెందారు. ఈమేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *