Tuesday, 3 November 2026

మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షన ఉద్రిక్తతకు దారితీసింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తికి హెల్మెట్‌ లేదన్న కారణంతో కానిస్టేబుల్‌ అడ్డుకోవడంతో అతను కింద పడిపోయాడు. కానిస్టేబుల్‌ తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆందోళనకారులు పోలీస్‌బూత్‌, వాహనాలకు నిప్పుపెట్టి బీభత్సం సృష్టించారు. దీంతో వీరిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేసి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *