Thursday, 5 November 2026

మరింత భాద్యతగా పనిచేస్తా రెండవసారి డీసీసీ అధ్యక్షులుగా చెవిటి వెంకన్న యాదవ్

 

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): మరింత భాద్యతగా పనిచేస్తానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రo లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెండోసారి డీసీసీ అధ్యక్షులుగా చెవిటి వెంకన్న యాదవ్ ఎన్నికైన సందర్బంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ అంజాద్ అలీ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైరు శైలేందర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా  చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రెండవసారి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు , మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.తనపై పూర్తి విశ్వాసంతో రెండోసారి అధిష్ఠానం జిల్లా అధ్యక్షుడిగా నియమించిందని, దింతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత భాద్యతాయుతంగా పని చేసి, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేనందుకు పార్టీ పటిష్టతకు కృషిచేస్తానని తెలిపారు.తన రాజకీయ జీవితం ఆర్డీఆర్ నాయకత్వంలో పనిచేశానని అన్నారు.ఎన్నో ఒడిదొడుకులు వచ్చిన ఎదుర్కొని క్రమశిక్షణను కాంగ్రెస్ పార్టీ నేర్పించిందని తెలిపారు.నిత్యం కార్యకర్తలతో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సమస్య పరిష్కార దిశగా పనిచేశానని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్లు తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానని చెప్పారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2018లో మొదటిసారి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైనట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు జిల్లాలో పోరాటాలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపామన్నారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూర్(ఎస్) మండల అధ్యక్షులు కందాల వెంకట రెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు కుంట్ల వెంకట నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి నాగుల వాసు, పిడమర్తి మల్లయ్య, అక్కేనపల్లి జానయ్య , చెరుకు రాము, జిల్లా అధికార ప్రతినిధి కుండమల్ల శేఖర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్ రెడ్డి, పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు రెబల్ శ్రీను, పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యలగందుల సాయి నేత, రెడ్ హౌస్ ఇంచార్జ్ నరేందర్ నాయుడు, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ రహీమ్, నాయకులు గడ్డం వెంకన్న, పందిరి వెంకన్న, ఓరుగంటి నాగేశ్వరరావు, అన్నమయ్య రాము, కోడి శివ, అబ్బాస్, అశోక్ యాదవ్, కుమార్ యాదవ్,మండలి సంజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.