బెల్లంపల్లి, మే 17, (జనంసాక్షి )సింగరేణి ఓపెన్ కాస్ట్ లలో పని గంటలు మార్పు చేయాలని టిఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరాం సింగ్ డిమాండ్ చేశారు. బుధవారంబెల్లంపల్లి టిఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నందున కార్మికులకు పని గంటలను మార్పు చేయాలన్నారు. వేసవి కాలంలో ఓపెన్ కాస్ట్ లో పని చేస్తున్న సింగరేణి కార్మికులకు సకాలంలో సరైన పద్ధతిలో ఓఆర్ఎస్ అలాగే మజ్జిగ ప్యాకెట్లు అందచేయాలని సూచించారు. ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో ఉన్నాయి గనుక సింగరేణి యాజమాన్యం దీనిని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కార్మికులు అలసటకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యందే కాబట్టి సకాలంలో స్పందించి కార్మికులకు ఓఆర్ఎస్ మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని సూచించారు. ఈసమావేశంలో నాయకులు గద్దల నారాయణ, సిరికొండ కనకయ్య, జీవరత్నం, బొల్లు మల్లయ్య, ఎండి హసన్, పుల్లూరి పోశం తదితరులు పాల్గొన్నారు




