Tuesday, 3 November 2026

మరోసారి రవిప్రకాశ్‌కు కోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌24 జనం సాక్షి  : ఎంతటివారైనా చట్టం ముందు సమానమేనని న్యాయస్థానం మరొక్కసారి తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. టీవీ9లో ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో సైబర్‌ కైమ్ర్‌ పోలీసులు తనపై కేసులు నమోదు చేయగా, ఆయనపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.
అలాగే ముందస్తు బెయిల్‌ ఇచ్చేటప్పుడు తనకు కోర్టు పెట్టిన షరతులను తొలగించాలని రవిప్రకాశ్‌ కోర్టులో పిటీషన్‌ వేయగా, ఆ పిటిషన్‌ని కూడా  హైకోర్టు కొట్టివేసింది. పోలీస్‌ స్టేషన్‌ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రవిప్రకాశ్‌ దాఖలు చేసిన పిటీషన్‌ కూడా హైకోర్టు తిరస్కరించింది.
టీవీ9ను టేకోవర్‌ చేసిన అలంద విూడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో వాటాల వివాదంలో, సంస్ధ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్‌ ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ అలంద కంపెనీ డైరెక్టర్‌ పి. కౌశిక్‌ రావ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రవిప్రకాశ్‌ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆయనకు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి లుక్‌ అవుట్‌ నోటీసులు విడుదల చేసింది ప్రభుత్వం.