ముజఫర్ నగర్ : ఉత్తరప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తాజాగా మరో గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది.యూపీలోని ముజఫర్ నగరలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుల్లో ఓ ఎస్సై కొడుకు కూడా ఉన్నాడు. దుకాణానికి వెళ్లిన ఓ మహిళకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, షాపు యజమానితో సహా అయిదుగురు ఈ దురాగతానికి పాల్పడ్డారు.
అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించినట్టుగా కొత్వాల్ ఎస్ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసిన ముగ్గురు నిందితులను అదులులోకి తీసుకన్నారు.మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు.




