జనంసాక్షి, రామగిరి : ప్రజాసేవలో వారికి లేరు ఎవరు సాటని ముస్త్యాల సర్పంచ్ లావణ్య మరోమారు నిరూపించారు. వివరాల్లోకి వెళితే రామగిరి మండలం ముస్త్యాల గ్రామ సర్పంచ్ లావణ్య, ఆ మహిళా సర్పంచ్ గ్రామ అభివృద్ధిలో ఎప్పుడూ అహర్నిశలు కృషి చేస్తూ ప్రజాసేవలో ముందుండే నాయకురాలిగా మంచి పేరున్న మహిళా సర్పంచ్ లావణ్య. గతంలో రోడ్డు ప్రమాదం బారినపడి తీవ్ర గాయాలు పాలై ఉన్న వారిని ఎంతోమందిని దగ్గరుండి మరి తన వాహనంలో హాస్పిటల్ కి చేర్పించి బాగయ్యేవరకు, యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండే మంచి మనసున్న నాయకురాలిగా పేరుంది. ఇందులో భాగంగా శనివారం సర్పంచ్ రామగిరి లావణ్య జయశంకర్ జిల్లా భూపాలపల్లి కి సాయంత్రం కుటుంబం తో కలిసి వెల్లి తిరుగు ప్రయాణం లో సుమారు రాత్రి . 8.00. గంటలకు. కాటరం దగ్గర మద్దుల పల్లికి చెందిన భాను ప్రకాష్ అనే వ్యక్తీ రోడ్డు ప్రమాదానికి గురై, రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన సర్పంచ్ వెంటనే హుటాహుటిన సర్పంచ్ తన స్వంత వాహనంలో హుటహుటీన మహాదేవ పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెల్లి ఆస్పత్రిలో చేర్పించడం జరిగిందని సర్పంచ్ అన్నారు. అదివారం ఉదయం మళ్ళీ భాను ప్రకాష్ వాళ్ళ కుటుంబంతో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకోవడం జరిగింది. రోడ్డు ప్రమాదానికి గురైన ప్రకాష్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రోడ్డుపై ఎంతో మంది వెళ్తున్న ఒక్కరు కూడా పట్టించుకోలేదని అటుగా వెళుతున్న సర్పంచ్ లావణ్య మాత్రం రాత్రి అని చూడకుండా దగ్గరుండి హాస్పిటల్ చేర్పించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఎంతైనా చిన్న వయసులో సర్పంచిగా గెలుపొంది ప్రజాసేవ కోసం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సర్పంచ్ లావణ్య పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




