Wednesday, 4 November 2026

మలిదశ ఉద్యమకారుడు సైదులు గౌడ్ కు ఘన సన్మానం

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడు కట్ల సైదులు గౌడ్ ను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కట్ల సైదులు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని, ఉద్యమ ద్రోహులకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.