శంకర్ సూచనల మేరకే అత్యవసర పరిస్థితిలు
పర్యావసనాలు పసిగట్టలేదు
ది డ్రమాటిక్ డికేట్-ది ఇందిరా గాంధీ ఇయర్స్‌లో ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ,డిసెంబర్11(జనంసాక్షి): భారత చరిత్రలో చీకటి ఆధ్యయనం ఎమర్జెన్సీపై భారత రాష్ట్రపతి సంచనల వాఖ్యలు చేశారు. అత్యవసర పరిస్థితి, దాని పర్యావసనాలపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి అంత అవగాహన లేదని, అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి శంకర్ రే సూచన మేరకే అమె నడుచుకున్నారనీ మంత్రి వర్గ సహచరులు, శంకర్ షా కమీషన్ విచారణలో తెలివి తప్పించుకున్నారనీ ఈ మేరకు ‘ది డ్రమాటిక్ డికేడ్- ది ఇందిరా గాంధీ ఇయర్స్’ పేరిట రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకంలో పేర్కోన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 1975 అత్యవసర పరిస్థితిపై ఈ పుస్తకంలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అత్యయిక పరిస్థితి విధింపు నిబంధనపై ఇందిరకు అవగాహన లేదని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.





