Thursday, 5 November 2026

మూడో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్ 16, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి.ఆదివారం సుల్తాన్ పేట్, లచ్ఛన్ గ్రామాల బిజెపి కార్యకర్తలు,ఇళ్లులేని నిరుపేదలు దీక్షలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతు మద్నూర్ మండలంలోని పేదలకు ఇప్పటివరకు డబుల్ బెడ్ రూం లు ప్రభుత్వం కట్టివ్వ లేదని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం లు నిర్మించే వరకు దీక్ష విరమించ బోమని వారు ప్రభుత్వానికి హెచ్చరించారు