గుడిహత్నూర్: జూలై 2 (జనం సాక్షి) జిల్లా కేంద్రం లోని కుమ్రం భీమ్ చౌక్ వద్ద నుాతనంగా ఏర్పాటు చేసిన కోమురం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 10 వ తేదీన ఉందని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ అన్నారు ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సమస్త ఆదివాసి సమాజం మహిళలు గ్రామ పటేళ్ళు, రాయ్ సెంటర్ సభ్యులు, ఆదివాసీ ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెందూర్ జలపతి, మండల అధ్యక్షుడు మెస్రం నాగ్ నాథ్, పెందూర్ గోవింద్, జయరాం, కాత్లే భారత్, ఆత్రం గణపతి, తదితరులు పాల్గొన్నారు
10న కోమురం భీం విగ్రహ ఆవిష్కరణ




