Tuesday, 3 November 2026

మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ నియామకం.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 3మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో పని చేసే57మంది జర్నలిస్టులుయూనియన్లకు అతీతంగా టియుడబ్ల్యుజె (ఐజెయు) మరియు టియుడబ్ల్యుజె 143 సభ్యులు ఏకగ్రీవంగా మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ ను ఎన్నుకున్నారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గా జార్జి విల్సన్,జనరల్ సెక్రెటరీ గా బాలాజీ,కోశాధికారి గిరిగౌడ్,గౌరవ అధ్యక్షుడు మురళి కృష యాదవ్, మహేష్ గౌడ్,ఉపాధ్యక్షులు అనబత్తుల రమేష్,పాండు గౌడ్,కృష్ణ మూర్తి, సదాచారి,సంయుక్త కార్యదర్శి నాయడు,సువర్ణ,వినోద్,ప్రచార కార్యదర్శి శివ కుమార్,కమిటీ సభ్యులుగా ప్రశాంత్,మనోజ్,నరేష్ , ప్రియాంక,బాలరాజు గౌడ్,సాయి కిరణ్, నాగరాజు,రమేష్ గౌడ్,సహదేవ్,ముఖ్య సలహాదారులు తేజ,హరి కృష్ణ యాదవ్,అమరేష్,అక్కల రాజు గౌడ్, యాదగిరి లు నియమితులయ్యారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.సర్కిల్ పరిధిలో పనిచేసే ప్రతి ఒక్క జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని,జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, ఇండ్ల పట్టాలు,జర్నలిస్టుల పిల్లల విద్య తదితర విషయాలపై తోడ్పాటును అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.జర్నలిస్టులు కలిసికట్టుగా పనిచేసి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఒకరికొకరు విమర్శలు చేసుకోకూడదని పేర్కొన్నారు.నేరెడ్ మెట్ లో నూతన ప్రెస్ క్లబ్ బిల్డింగ్ నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసేందుకుసర్కిల్ పరిధిలో పనిచేసే ప్రతి జర్నలిస్టులు తమ వంతు సహకారాన్ని అందిస్తామనిపేర్కొన్నారు.ఈసందర్భంగా మల్కాజిగిరి ఎమ్మల్యే జర్నలిస్టుల సంక్షేమానికి చేస్తున్న కృషిని కొనియాడారు.ఆయన సహకారం జర్నలిస్టులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా టియుడబ్ల్యుజే 143 రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ప్రతిచోటా ఇలాగే యూనియన్ లకు అతీతంగా జర్నలిస్టులు ఏకతాటిపైకి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.నేరెడ్ మెట్ లో నూతనంగా నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్ భవనానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి జర్నలిస్టుల సంక్షేమానికి చేస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.