టేకులపల్లి, ఏప్రిల్ 15( జనం సాక్షి): విద్యుత్ ఘాతంతో ప్రమాదానికి గురైన భూక్య వెంకటేష్ హైదరాబాద్ ఉస్మానియా వైద్యశాలలో చికిత్స పొందుతుండగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ నందు ఉస్మానియా ఆసుపత్రి కి ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరి సింగ్ నాయక్ దంపతులు వెళ్ళి పరామర్శించారు. ఈ నెల 12న చుక్కాల బోడు తండాకి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ భూక్య వెంకటేష్ విద్యుత్ ప్రమాదానికి గురైన సంఘటన విధితమే. వెంటనే కొత్తగూడెం వైద్యశాలకు తరలించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. ఎమ్మెల్యే పరామర్శించిన అనంతరం వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో ఉస్మానియా వైద్యశాల డాక్టర్ల బృందంచే మాట్లాడి మెరుగైన వైద్య సదుపాయం అందే విధంగా చర్యలు తీసుకున్నారు. శనివారం జరగబోయే ఆపరేషన్ నిమిత్తం డాక్టర్లతో చర్చించి భూక్య వెంకటేశ్వర్లుకి మనోధైర్యాన్ని అందించి ఆర్థిక సహాయం అందించారు. క్షతగాత్రుడు వెంకటేష్ కి మనోధైర్యాన్నిస్తూ అండగా ఉంటానని అధైర్య పడవద్దు అని ఎమ్మెల్యే భరోసాని ఇచ్చారు.




