పెనుబల్లి, ఫిబ్రవరి 13(జనం సాక్షి)పెనుబల్లి మండలం బదిలీపై వెళుతున్నఅడవిమల్లేల మెడికల్ ఆఫీసర్ శాంతరాణి కి సోమవారం ఘనంగా వీడ్కోలు సన్మానం చేశారు, పెనుబల్లి మండలం అడవిమల్లేల పిహెచ్సి లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాంతరాణి హైదరాబాద్ లోని సరోజినిదేవి కంటి ఆసుపత్రి కి బదిలీ అయ్యారు, పెనుబల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆమెను డిప్యూటీ డి ఎం హెచ్ ఒ సీతారాం , పిహెచ్సి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో తన ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు వున్నప్పటికి ప్రజలు శ్రేయస్సే లక్ష్యంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ, మండలంలో కరోనా కట్టడికి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించారని అన్నారు, అలాంటి డాక్టర్ మండలానికి దూరం కావడం బాధ గా వుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడవిమల్లేల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్, సిబ్బందితదితరులు పాల్గొన్నారు.




