Wednesday, 4 November 2026

మళ్లీ టమోటా ధరలమంట

చిత్తూరు,జూలై10(జ‌నం సాక్షి): టమాటా ధరలు మంటపుట్టిస్తున్నాయి. అత్యధికంగా పంటపండే మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో కిలో టమోటా అత్యధికంగా 20 వరకు పలికింది. దీనికితోడు దిగుబడి తగ్గుముఖం పట్టింది. 200 టన్నులకు మించి మార్కెట్‌కు రావడం లేదు. ఫలితంగా ఎగుమతికి కావాల్సిన టమోటాలు వ్యాపారులకు అందడం లేదు. దిగుబడి తగ్గి, డిమాండ్‌ పెరుగుతుండటంతో ధర పుంజుకుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు వేసిన పంట పూత దశలో ఉంది. ఈ దిగుబడి వస్తే ధరలు తగ్గే అవకాశాలున్నాయని వ్యాపారులు పేర్కొన్నారు..కాయనలు హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై పట్టణాలకు ఎగుమతి చేశారు. పంటల దిగుబడి వచ్చేవరకు ఇలాగే ఉంటుందని అంటున్నారు.