హైదరాబాద్: బంగారం ధరలు మళ్లీ పెరగసాగాయి. ఇటివల 25 వేల దిగువకి వచ్చిన పసిడి ధర వారం రోజుల్లోనే 1600 రూపాయల మేర పెరిగింది.దేశీయంగా బంగారం కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడడంతో పాటు ,మే రెండో వారంలో అక్షయ తృతీయ ఉండటంతో ధరల్లో మార్పు చోటు చేసుకుంటునట్లు నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,390 ఉండగా ,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,100 రూపాయలు ఉంది వెండి ధర రూ.45,500 నమోదైంది.




