Wednesday, 4 November 2026

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగే బైక్ ర్యాలీ ని జయప్రదం చేయండి.

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–మహాత్మా జ్యోతిరావు పూలే 197 వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం నిర్వహించే బైక్ ర్యాలీ ని జయప్రదం చేయాలని మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సమన్వయ కమిటీ కన్వీనర్ మాటూరి అశోక్ కోరారు. ఆదివారం స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బైక్ ర్యాలీ స్టిక్కర్ల ను ఆయన ఉత్సవాల సమన్వయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు అన్ని రాజకీయ పార్టీల, కుల సంఘాల మరియు ప్రజా సంఘాల నాయకులతో కలిసి కార్య ప్రణాళిక సిద్ధం చేసామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సమన్వయ కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్, రావుల రాజు, మాయ కృష్ణ, కొత్త బాలరాజు, దేవరకొండ నర్సింహ చారి, పిట్టల బాలరాజు,మచ్చ నర్సింహ గౌడ్, నాయకులు పోత్నక్ ప్రమోద్ కుమార్, మిర్యాల శ్రీనివాస్, జూకంటి ప్రవీణ్ కుమార్, చల్లగురుగుల రఘుబాబు,బెండె శ్రీకాంత్, గాజుల కుమార్,మొలుగు లక్ష్మయ్య,సాల్వేరు ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.